ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసిన వైద్యాధికారి

ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం వైద్యాధికారి డా.జితేందర్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం వివిధ రికార్డులను పరిశీలించారు. సరైన సమయంలో విధులు నిర్వహించాలని, వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో HEO తులసీదాస్, కైలాష్, సింధు, శ్రీలత, అనిత, సంగీత, రత్నాబాయి పాల్గొన్నారు.