కారును ఢీకొట్టి ట్రాలీ వాహనం బోల్తా

WGL: ట్రాలీ వాహనం అదుపు తప్పి కారును ఢీకొన్న ఘటన రాయపర్తి మండలం మైలారంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం అదుపుతప్పి మొదట ఆటోను, తర్వాత కారును బలంగా ఢీకొట్టి బోల్తా పడింది, ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.