రైల్వేశాఖ కీలక నిర్ణయం

రైల్వేశాఖ కీలక నిర్ణయం

GNTR: రైలు పట్టాలపైకి పశువులు, ప్రజలు రావడం వల్ల గుంటూరు డివిజన్‌లో రైళ్ల వేగం తగ్గిపోతుంది. ఈ సమస్య నివారణకు గుంటూరు–నడికుడి మార్గంలో 69కి.మీ.లో యాంటీ క్రాష్ బ్యారియర్, RCC ఇన్వర్టెడ్ టీ ప్యానల్ ఫెన్సింగ్ వేసేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా రూ.29.89కోట్లతో 3భాగాలుగా పనులు చేపట్టనున్నారు. బిడ్డింగ్ మే 8న ప్రారంభమై, మే 22న ముగియనుంది.