VIDEO: రెండు ఎకరాల ఫామాయిల్ తోట దగ్దం

WGL: రాయపర్తి మండలం రాగన్నగూడెంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు వరికోయకాలకు నిప్పు అంటించడంతో మంటలు వ్యాపించి సమీపంలో ఉన్న రెంటాల గోవర్ధన్ రెడ్డికి చెందిన రెండు ఎకరాల పామాయిల్ తోటలో మంటలు వ్యాపించి డ్రిప్ సిస్టమ్, చెట్లు దగ్ధమైయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు.