VIDEO: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తాజా అప్‌డేట్
MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.26 మీటర్లుగా ఉంది. నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు 18.1193 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 1,24,040 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 14 గేట్ల ద్వారా 77,735 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.