‘ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా చంపేస్తాం’
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ముజ్తబా ఎన్నికైనట్లు పలు వార్తలు వస్తున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖమేనీ స్థానాన్ని ఎవరు భర్తీ చేసినా వారిని ఖతం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాన్ని నాశనం చేయాలనుకునేవారని వదలిపెట్టబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తేల్చి చెప్పారు. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా.. ఎక్కడ దాక్కొన్నా వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.