సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం

SRPT: సీపీఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం నడిగూడెం మండలం కేశవాపురం గ్రామంలో, నడిగూడెం మండల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సత్యనారాయణ పరిశీలించారు.