అడవుల సంరక్షణకు కృషి చేయాలి: మంత్రి సీతక్క

MLG: చెట్లు, అడవులు మానవ జీవనధారానికి ఎంతో ముఖ్యమని మంత్రి సీతక్కన్నారు. ఆదివారం తాడ్వాయి మండలంలోని అటవీ గ్రామాల్లో అభివృద్ధి పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చెట్లు నాటుతూ అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.