ఘనంగా ఘంటసాల 103వ జయంతి వేడుకలు

ఘనంగా ఘంటసాల 103వ జయంతి వేడుకలు

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా శాఖ గ్రంథాలయంలో గురువారం సుప్రసిద్ధ గాయకులు ఘంటసాల 103వ జయంతి కార్యక్రమాన్ని ఇంచార్జ్ డిప్యూటీ లైబ్రరీయన్ సంపూర్ణ కాళహస్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సంగీత రంగానికి చేసిన సేవలను కొనియాడారు. పలువురు గాయకులు ఘంటసాల గీతాలను ఆలపించి అందరినీ అలరించారు.