ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NLG: చండూరు మండలం పుల్లేములలో లారీలు సకాలంలో రాని కారణంగా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ త్రిపాఠి సోమవారం రాత్రి పుల్లేముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీలు సకాలంలో రాకపోవడంపై లారీ కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్య లేకుండా లారీలను ఏర్పాటు చేయాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.