రైల్వే లైజన్ జిల్లాస్థాయి అధికారిగా మురళి
VZM: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేఆర్ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఈ. మురళిని రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించి జిల్లాస్థాయి లైజన్ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.