వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: జగదీష్ రెడ్డి

TG: అసెంబ్లీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డిని BRS ఎమ్మెల్యేలు కలిశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై తమ అభిప్రాయం చెప్పారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు చూపించారు. పార్టీ మారిన 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పారు. పార్టీ మారలేదని చెప్పుకుంటున్న MLAలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.