వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

KKD: గణేష్ ఉత్సవాలు పురస్కరించుకుని జిల్లాలో త్వరలో జరగబోయే వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా ఎస్పీ జి.బిందు మాధవ్ మంగళవారం కాకినాడ పట్టణంలో పర్యటించారు. వినాయక విగ్రహాల ఊరేగింపులు క్రమబద్ధంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.