యాదగిరిగుట్టలో సామూహిక గిరిప్రదక్షిణ
TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక గిరిప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామున కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ అధికారులు స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో వెంకట్రావు పాల్గొన్నారు.