వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు: ఎస్పీ

GDWL: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వాటిని దాటే ప్రయత్నం చేయకూడదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మానవపాడు మండల కేంద్రంలో ప్రవహిస్తున్న పెద్దవాగును, బీచుపల్లి పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.