రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది: MP
KRNL: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో 'రైతన్నా మీ కోసం' కార్యక్రమంలో MP పాల్గొన్నారు. రైతుల ఇంటింటికి వెళ్లి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రసెసింగ్, ప్రభుత్వ మద్దతు గురించి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.