ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం: మంత్రి
అన్నమయ్య: కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ప్రాంగణంలోనే పలు సమస్యలు పరిష్కరించడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది.