VIDEO: దుర్గ భవాని ఆలయంలో మహిళల హల్దీ మహోత్సవం
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని దుర్గా భవాని మాతా ఆలయం ఉత్సవాల్లో శనివారం రాత్రి మహిళలు హల్దీ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు ముఖానికి పసుపును రుద్దుకొని మహిళలు సందడి చేశారు. ఈ సందర్భంగా ఆటపాటలతో సంబరం జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా మహిళలతో కిటికీటలాడింది.