VIDEO: 'భీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలి'
WNP: పీఎం జీవన జ్యోతి భీమా యోజన, సురక్ష బీమా యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ సూచించారు. రేవెల్లి మండలం గౌరీదేవిపల్లిలో శుక్రవారం జనసురక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రూ.456 చెల్లించి పీఎంజేజేబీవై, రూ.20 చెల్లించి పీఎంఎస్బీవై భీమా సౌకర్యాలను పొందాలన్నారు.