వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

MDK: నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అర్జున్ తండాకు చెందిన బానోత్ మౌనిక(20) అనే వివాహిత అదృశ్యమయ్యారు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.