'విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలి'

NLG: విద్యార్థులు కష్టపడి చదివి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని చిట్యాల లైన్స్ క్లబ్ అధ్యక్షుడు జనగాం రవీందర్ గౌడ్ అన్నారు. చిట్యాల, చిన్నకాపర్తి జి.ప.ఉ.పాఠశాలల్లో యువవికాస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యక్తిత్వ వికాస నిపుణులు గూడూరు అంజిరెడ్డి విద్యార్థులకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, లక్ష్యం గురించి మోటివేషన్ అందించారు.