భూమిపూజ చేసిన సంఘ సభ్యులు

JGL: కథలాపూర్ మండలంలోని దులూరు గ్రామంలో బుధవారం రోజున రజక సంఘ నూతన భవన నిర్మాణానికి సంఘ సభ్యులు భూమిపూజ చేసారు. రజక సంఘానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 3 లక్షల రూపాయలు మంజూరు చేసారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి, సహకారాన్ని అందించిన వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు.