జిల్లాలో పోస్ట్ ఆఫీస్‌లో పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ ప్రారంభం
శ్రీకాకుళం జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో ఇవాళ పార్సిల్ ప్యాకింగ్ యూనిట్‌ను జిల్లా పోస్టల్ సూపరిండెంట్ వి.హరిబాబు ప్రారంభించారు. దీని ద్వారా ఇక్కడే పార్సిల్ మెటీరియల్ విక్రయించి, ప్యాకింగ్ చేయించి దూరప్రాంతాలకు పంపించవచ్చని ఆయన అన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కొన్ని సబ్ పోస్ట్ ఆఫీసులలో ఉంటుందన్నారు.