ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
KNR: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, తాడికల్, అంబాల్ పూర్, మొలంగూర్, కన్నాపూర్, రాజాపూర్, కల్వల గ్రామాల్లో శనివారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.