మరోసారి టీచర్ల సర్దుబాటు

మరోసారి టీచర్ల సర్దుబాటు

ADB: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్దులకు ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ చర్యలు చేపడుతుంది. ఈ మేరకు జిల్లా అధికారులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు అవసరానికి మించి టీచర్లు ఉన్న బడుల నుంచి సర్దుబాటు చేయనున్నారు. ఇప్పటికే ఆయా మండలాల ఎంఈవోలు, విద్యాశాఖ అధికారులకు వివరాలు సమర్పించారు. రెండు,మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.