నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
JN: జనగామ, నర్మెట్ట మండలాల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఇవాళ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాన్ని, దరఖాస్తుల స్వీకరణ, పత్రాల పరిశీలన, నామినేషన్ రిజిస్టర్‌లు, వీడియో రికార్డింగ్, భద్రతా చర్యల అమలు వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. ఏ చిన్న లోపం జరగకుండా చూసుకోవాలన్నారు.