బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
GDWL: మల్దకల్ మండలంలో మైనర్ బాలిక వివాహాన్ని అధికారులు సోమవారం అడ్డుకున్నారు. సద్దలోనిపల్లి గ్రామంలో ఓ బాలికకు పెళ్లి జరపుతున్నారనే సమాచారంతో ICDS సూపర్వైజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి చేరుకుని పెళ్లిని నిలిపివేశారు. ఈ ఘటనపై పెళ్లికొడుకు, అతని తల్లి, అలాగే బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.