మైదుకూరు ప్రాంత ప్రజలకు సీఐ సూచనలు

మైదుకూరు ప్రాంత ప్రజలకు సీఐ సూచనలు

KDP: మైదుకూరు మున్సిపాలిటీ, మండల పరిధిలో వర్షాలు కురుస్తున్న కారణంగా పాత ఇల్లు, మట్టి మిద్దెలు, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో ఉండడం శ్రేయస్కరం కాదని, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని మైదుకూరు సీఐ రమణారెడ్డి సోమవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సుచించారు.