నిజాయితీ చాటుకున్న వ్యక్తి

నిజాయితీ చాటుకున్న వ్యక్తి

WGL: దొంతి మధుకర్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డుపై దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన మధుకర్‌కు మామునూర్ గ్రామంలోని బస్ స్టాప్ సమీపంలో రూ.9,500 నగదు దొరికింది. ఈ డబ్బును ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్‌కి అప్పగించారు. ఈ సందర్భంగా అతన్ని సీఐ ప్రత్యేకంగా అభినందించారు.