రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047పై డీజీపీ సమీక్ష
TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 సన్నాహాలపై DGP శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో రాష్ట్ర పోలీసుల సాంకేతిక సామర్థ్యాలు, భద్రత, రక్షణపై వివరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్‌ను ప్రవేశపెట్టడంపై ప్రతిపాదనను సిద్ధం చేయాలని సూచించారు. కాగా ఈ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్యూచర్ సిటీలో నిర్వహించనున్నారు.