పేలుడు.. ముగ్గురు జవాన్లకు గాయాలు

మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి, ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆపరేషన్ కగార్ ద్వారా 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.