భారీ వరదలు.. కామారెడ్డి MLA ఎక్కడ?

భారీ వరదలు.. కామారెడ్డి MLA ఎక్కడ?

KMR: భారీ వర్షాల ధాటికి జిల్లా అతలాకుతలం అవుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. ఈ తరుణంలో కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డిపై ప్రజలు మండిపడుతున్నారు. వరదల సమయంలో ప్రజానికానికి అండగా ఉండాల్సిన  MLA అడ్రస్ లేడంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఆంశం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.