పెట్రోల్‌పై పన్ను తగ్గించడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్

పెట్రోల్‌పై పన్ను తగ్గించడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించటంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపులు కేవలం కంటితుడుపు చర్యలే అంటూ వ్యాఖ్యానించింది. ఈ తగ్గింపు లబ్ధి డీలర్లు, వినియోగదారుల వరకు చేరదని ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా విభాగాధిపతి పవన్ ఖేడా ప్రకటనను విడుదల చేశారు.