సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించిన ఎమ్మెల్యే

సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించిన ఎమ్మెల్యే

SRPT:  తిరుమలగిరి మండలం వెలిశాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఎమ్మెల్యే మందుల సామేలు అధికారికంగా ప్రకటించారు. కుంభం మంజుల సతీష్ గౌడ్ను పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బలపరిచారు. గ్రామంలో వేరేవారు కూడా కాంగ్రెస్ అభ్యర్థులుగా చెప్పుకోవడంతో నెలకొన్న గందరగోళం, ఎమ్మెల్యే ప్రకటనతో సద్దుమణిగింది. వెలిశాల సర్పంచ్ మంజుల సతీష్ గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.