'తేమ శాతం సరిగా వచ్చాకే ధాన్యాన్ని తీసుకురావాలి'

'తేమ శాతం సరిగా వచ్చాకే ధాన్యాన్ని తీసుకురావాలి'

PDPL: రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని 17% లోపు తేమ వచ్చిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వరిని కోయగానే నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని, అలా చేస్తే ధాన్యం కాంటా 4 నుంచి 5 రోజులు ఆలస్యం అవుతుందన్నారు. రైతులు వరి కోతల తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు.