నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ATP: కళ్యాణదుర్గం 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు బెలుగుప్ప, కళ్యాణదుర్గం రూరల్, మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు కుందుర్పి శెట్టూరు, కంబదూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.