'వికారాబాద్‌ జిల్లా రద్దుకు కుట్ర'

'వికారాబాద్‌ జిల్లా రద్దుకు కుట్ర'

రంగారెడ్డి: రాష్ట్రంలో జిల్లాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని తన నివాసంలో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత వికారాబాద్ ప్రత్యేక జిల్లా కోసం ఎంతోమందితో పాటు తానుకూడా పోరాటం చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.