రెండో విడత.. తొలి రోజు 155 నామినేషన్లు
KMR: జిల్లాలో రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ విడతలో 197 గ్రామ పంచాయతీలు 1,654 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 81 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 74 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.