18న ఆశా కార్యకర్తల ధర్నా

CTR: ఆశా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 18న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు యూనియన్ జిల్లా కార్యదర్శి గంగా తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవిని కలిసి సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ మేరకు వినతిపత్రం అందించారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేంద్రన్, గంగరాజు పాల్గొన్నారు.