'చేతులు కడుక్కోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం'
NTR: ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడంతో మన ఆరోగ్యం మరింత మెరుగుపరుచుకోవచ్చని గంపలగూడెం మండల విద్యాశాఖ అధికారి టీవీడీఎల్ నరసింహారావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీడీఎల్ మాట్లాడుతూ.. భోజనానికి ముందు మాత్రమే కాదని, తరచూ చేతులు కడుక్కోవడం మంచిదన్నారు.