మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో పెరుగిన వరద ప్రవాహం

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం నాటికి బ్యారేజీలోకి 3,73,500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ప్రవాహం 1.43 లక్షల క్యూసెక్కులు వరద పెరిగినట్లు అధికారులు తెలిపారు.