ఆదర్శ గ్రామంలో స్వచ్ఛభారత్
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 395వ వారం స్వచ్ఛభారత్ 6వ వార్డులో చేపట్టారు. ముళ్ళ పొదలను, చెత్తాచెదారం తొలగించారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, మాజీ సర్పంచ్ పుష్పలత, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.