ఉద్యాన పంటలతో జీడీపీ పెంపు: కలెక్టర్

ఉద్యాన పంటలతో జీడీపీ పెంపు: కలెక్టర్

నంద్యాల జిల్లాలో ఉద్యాన పంటలను పెంపొందిస్తే జీడీపీ పెరుగుతుందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పద్మావతి నగర్‌లో జరిగిన జిల్లా స్థాయి TOT శిక్షణను గురువారం ప్రారంభించారు. అధికారులు సమన్వయంతో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలపై అవగాహన పెంచి రైతులకు లాభాలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.