జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు

జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు

KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే ఒక నెల జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తప్పవని SP హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.