బొమ్మలరామారంలో సర్వాయి పాపన్న జయంతి

BHNG: బొమ్మలరామారం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MPDO వి.రాజా త్రివిక్రమ్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జి. శ్రీమాలిని ఎంపీవో పర్యవేక్షకులు జి.జ్ఞాన ప్రకాష్ రెడ్డితో పాటు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.