అంగన్వాడీ భవనానికి రక్షణ గోడ నిర్మాణం

SKLM: సంతబొమ్మాళి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు, రక్షణ గోడ, పోషణ వాటికల నిర్మాణాలు చేపడుతున్నట్లు కోటబొమ్మాళి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ హైమావతి తెలిపారు. ఆదివారం అంగన్వాడీ కేంద్రానికి మంజూరైన రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. ఈ పనులకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు దగ్గర ఉండి చేయించాలన్నారు.