రైతుల కోసం పనిచేసిన వ్యక్తి రాజారెడ్డి: మాజీ మంత్రి

రైతుల కోసం పనిచేసిన వ్యక్తి రాజారెడ్డి: మాజీ మంత్రి

ATP: ఓబులదేవరచెరువు సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన బీద రాజారెడ్డికి కదిరిలో సన్మాన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో పనిచేస్తూ రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి రాజారెడ్డి అని కొనియాడారు. అనంతరం ఆయనను సన్మానించారు.