పటాన్ చెరులో ప్రమాదం.. ఒకేసారి మూడు బస్సులు ఢీ
SGR: పటాన్ చెరు మండలం రుద్రారం పరిధిలో తెలంగాణ, కర్ణాటక ఇంటర్సిటీ, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ( ప్రశాంత్, శ్యాంబాబు) క్షేత్రస్థాయికి చేరుకుని క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.