'పీఎం శ్రీ నిధులను వినియోగించుకోవాలి'
BHNG: పీఎం శ్రీ నిధులను పాఠశాలలు తప్పక వినియోగించుకోవాలని జిల్లా స్థానిక సంస్థల ఇంఛార్జ్, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్‌లో పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన నిధులను నిబంధనల మేరకు వినియోగించాలని పాఠశాలల హెడ్‌మాస్టర్లకు ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన సూచించారు.