పార్కును కాపాడాలని ZCకి ఫిర్యాదు

పార్కును కాపాడాలని ZCకి ఫిర్యాదు

HYD: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66లోని GHMC పార్కులో నుంచి అక్రమ నిర్మాణం చేపడుతూ రోడ్డు వేస్తున్నారని కాలనీ వాసులు జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతికి ఫిర్యాదు చేశారు. ఎంత చెప్పినా సదరు కబ్జాదారులు వినడం లేదని పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పార్కులో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయని, స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.